జగన్ పాలనకు పనికి రాడని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి , ఎంపీ విజయసాయి రెడ్డిలు లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిని శ్మశానం అని అవమానించిన ముఖ్యమంత్రి జగన్… ఇప్పుడు శ్మశానంలో కూర్చొని పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు. అమరావతిని భ్రమరావతి అని అంటున్న మీరు భ్రమల్లో ఉండి పాలిస్తున్నారా? అని అడిగారు. అధికారంలోకి వచ్చి 7 నెలలయిందని… రాజధాని ప్రాంతంలో 7 ఎకరాల్లో అయినా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. జగన్ పాలనకు పనికి రాడు, పాలన చేతకాదు అని స్వయంగా మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు.

అమరావతిని రియలెస్టేట్ వెంచర్ లా తయారు చేశారని మీరు మాట్లాడటం దారుణం విజయసాయిరెడ్డిగారు అని బుద్దా వెంకన్న అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన రైతులు ధనవంతులు కాకూడదా? అని ప్రశ్నించారు. ఇలాంటివారి కోసమే చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని తెలిపారు. జగన్ గారిలా విదేశాల్లో సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేసుకుని, సొంత కంపెనీల్లోకి డబ్బు మళ్లించి ప్రజలను దోచుకోలేదని మీకు, జగన్ కు గుర్తు చేస్తున్నానని చెప్పారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. దిశ చట్టం రూపొందించే క్రమంలో అసెంబ్లీలో చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదని ఆయన ట్వీట్ చేశారు.

‘దిశ చట్టాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారు. యాక్టు కాపీని పంపిస్తే తామూ అనుసరిస్తామని ఢిల్లీ, ఒడిశా, కేరళ రాష్ట్రాలు అభ్యర్థించాయి. చట్టం రూపొందించే చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు నాయుడు ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శించారు.  ఉల్లిపై లొల్లి చేసి దివాళాకోరుతనాన్ని బయట పెట్టుకున్నారు’ అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

అటు మూడు రాజధానులపై ముందే నిర్ణయం తీసుకున్నారా? అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై గల్లా జయదేవ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ… కమిటీ నివేదిక రాకముందే సీఎం ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు.

Leave a Reply