కృష్ణాలో టీడీపీకి ఊహించని షాక్: వైసీపీలో చేరిన సీనియర్ నేత సోదరుడు…

andhrapradesh politics tdp vs ysrcp
Share Icons:

విజయవాడ, 8 జనవరి:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కృష్ణా జిల్లాలో అధికార టీడీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ విప్ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర రావు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్సార్ సిపి అధినేత జగన్‌ను కలిసిన తర్వాత బుద్దా నాగేశ్వర రావు తన పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటనచేశారు.

ఇక టీడీపీ పార్టీ విధానాలు నచ్చకే వైసీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తమ సోదరుడు బుద్దా వెంకన్న బిసి సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదని, ఆయనతో పాటు టీడీపీలో కీలకంగా వున్న చాలామంది బిసి నేతలు కూడా  బిసిలకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. బిసిలకు వైఎస్సార్‌సిపి పార్టీ వల్లే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

మామాట: టీడీపీకి ఏమోగాని మీ అన్నకి షాక్ ఇచ్చారు…

Leave a Reply