అసెంబ్లీ రూల్స్ కమిటీలో వంశీకి చోటు:  టీడీపీ నేతగానే పదవి ఇచ్చారా?

Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ మారిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ….రాజకీయ భవిష్యత్ అయోమయంలో ఉండగానే ఆయనొక పదవి వచ్చింది. అసెంబ్లీ రూల్స్ కమిటీలో ఆయనకు చోటు దక్కింది. అయితే ఆయనకు తెలుగుదేశం ఎమ్మెల్యేగానే పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో నాలుగు కమిటీలకు సభ్యులని నియమించారు.వాటిల్లో ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్కసారి కమిటీల్లో ఎవరెవరు ఉన్నారని విషయం పరిశీలిస్తే

రూల్స్‌ కమిటీ:

ఛైర్మన్‌గా తమ్మినేని సీతారాం…సభ్యులు : ఆనం రామనారాయణరెడ్డి, వెంకటచిన అప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధరరెడ్డి, బి.అప్పలనాయుడు, వల్లభనేని వంశీ(టీడీపీ)

ఎథిక్స్‌ కమిటీ:

ఛైర్మన్‌గా అంబటి రాంబాబు… సభ్యులు : చెన్నకేశవరెడ్డి, ఎం.గజన్మోహన్‌రావు, ఎస్‌.రఘురామిరెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, ఎం.వి.పి.అప్పారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి(టీడీపీ)

ప్రివిలేజ్‌ కమిటీ:

ఛెర్మన్‌గా కాకాని గోవర్థనరెడ్డి… సభ్యులు : వెంకట రమణమూర్తిరాజు, ఎస్‌.వెంకటచిన అప్పలనాయుడు, వి.వరప్రసాదరావు, శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, అనగాని సత్యప్రసాద్(టీడీపీ).

పిటీషన్ల కమిటీ :

ఛైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి.. సభ్యులు : కె.శ్రీధర్‌రెడ్డి, వసంత వెంకట కృష్ణప్రసాదు, కాసు మహేష్‌రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఏలూరి సాంబశివరావు(టీడీపీ)

హామీల కమిటీ:

ఛైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ.. సభ్యులు : పి.పూర్ణచంద్రప్రసాదు, కె.అబ్బయ్యచౌదరి, ఎం.వెంకట మల్లికార్జునరెడ్డి, కె.నాగార్జునరెడ్డి, అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌, పి.జి.వి.ఆర్‌.నాయుడు(టీడీపీ)

ఇలా ప్రతి కమిటీలో ఒక టీడీపీ ఎమ్మెల్యేకు చోటు దక్కింది. అయితే వంశీకు కూడా అలాగే చోటు ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి వంశీ వైసీపీలో చేరడానికి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం ఎమ్మెల్యేగా, టీడీపీ సభ్యునిగా రాజీనామా చేశారు. కానీ అది వాట్స్ యాప్ రాజీనామా మాత్రమే . అధికారికంగా ఆయన తన రాజీనామాను పంపించలేదు. ఇప్పటి వరకు ఆయన తన అధికారిక రాజీనామాపై స్పందించనూ లేదు . దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారో అన్న అనుమానం సైతం తలెత్తుతుంది . వంశీ అనుచరులు వైసీపీ లో చేరతారని చెప్తున్నా ఇప్పటి వరకు వంశీ అధికారికంగా రాజీనామా చెయ్యకపోవటంతో ఆయన చేరికపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాకపోతే వంశీ ఏదో బలవంతంగా రాజీనామా చేసినట్లుగా రాసిన లేఖల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పెద్ద చర్చ జరిగింది. అసలు వంశీని పార్టీలోకి తీసుకోవడం అవసరమా అన్న అభిప్రాయాన్ని చాలామంది వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అంతే కాదు వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వైసీపీ అభిమానవర్గాలే పెద్దగా ఆసక్తితో లేవు. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వంశీ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా ? లేదా? అన్న డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply