జలీల్‌ఖాన్ సంచలన ప్రకటన…

జలీల్‌ఖాన్ సంచలన ప్రకటన…
Views:
217

విజయవాడ, 10 జూలై:

విజయవాడ వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రాబాబు అనుమతిస్తే వచ్చే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేస్తానన్నారు. అలాగే జగన్‌పై మా కుమార్తె పోటీ చేస్తుందని జలీల్‌ఖాన్ చెప్పుకొచ్చారు.

ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రానికి సైతాన్‌లా తయారయ్యాడని, తనను తాను రక్షించుకొనేందుకుగాను పాదయాత్ర చేస్తున్నారని  ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై కూడా జలీల్‌ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.

పవన్, జగన్, కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. పవన్‌కల్యాణ్ ఓ దొంగని, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసిందేనన్నారు. పీఆర్పీని ముంచి మంత్రిపదవి తీసుకున్న చరిత్ర మీది కాదా?’ అని నిలదీశారు. ప్రధాని మోదీ ముగ్గురు దొంగలతో కలిసి అధికారం కోసం ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు.

మామాట: పోటీ ఒకే గాని… మరి గెలవగలరా?

(Visited 267 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: