చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్… విధ్వంసకారుడు జగన్..

ap cm jagan recommended cbi inquiry on tdp former mla and chandrababu ready to help tdp leader
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ‘రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం తుగ్లక్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఛీ కొట్టడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఢిల్లీలో కనపడిన అందరి కాళ్లు పట్టుకుంటున్నారట కదా, విజయసాయిరెడ్డి?’ అని ప్రశ్నించారు. ‘రాజధానిగా అమరావతి నోటిఫై కాలేదు అంటూ అరిచారు. కేంద్రం 23.04.2015 నే అమరావతి రాజధానిగా నోటిఫై అయ్యింది అని క్లారిటీ ఇవ్వడంతో జగన్ గారి మైండ్ బ్లాంక్ అయ్యింది. రాజధానిని తరలించడానికి ఇంకా ఏమైనా అడ్డదారులు ఉన్నాయా? అని వెతుక్కునే పనిలో పడ్డారు విధ్వంసకారుడు జగన్ గారు’ అని ట్వీట్ చేశారు.

‘తప్పుడు లెక్కలు రాసే మీరే ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలి. జగన్ గారికి, మీకు డబ్బు పిచ్చి పోగొట్టేలా మనీ డీ-అడిక్షన్ సెంటర్లు పెట్టించుకోండి కాస్త ఉపయోగం ఉంటుంది’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు.

ఇక చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. రైతు ద్రోహి తాను కాదని.. చంద్రబాబు, లోకేశ్ అని విమర్శించారు. చంద్రబాబు రైతు మిత్ర అయితే మంగళగిరిలో లోకేశ్‌ను ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. మంగళగిరికి గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజలకు తెలుసు అని గుర్తుచేశారు. అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు తాను తీసుకెళ్లినా రైతుల వివరాలను మీడియా ముందు చదివి వినిపించారు.

 

Leave a Reply