ఆ పదవికి రాజీనామా చేస్తా…వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

Share Icons:

విజయవాడ:

 

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి బీసీ నేతకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానన్నారు.

 

ఇక టీడీపీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని, ఐదారు సార్లు ఓడినవారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు..? అని ఈ సందర్భంగా సొంత పార్టీనే ప్రశ్నించారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని బుచ్చయ్య పిలుపునిచ్చారు. అలాగే తాను ఇప్పటికే ఆరుసార్లు గెలిచానని.. అయితే భవిష్యత్తులో ఇక పోటీ చేయనని గోరంట్ల తేల్చిచెప్పారు.

 

ఇక ‘సంక్షేమం, అభివృద్ధి చేసినా పార్టీ గెలవలేదంటే ఎక్కడో లోపం ఉందన్నారు. మంత్రులు, జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు విఫలమయ్యాయి. నియామకాల్లో పారదర్శకత కోసం చంద్రబాబు కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఇప్పుడు వైసీపీ.. వాళ్ల పార్టీ కార్యకర్తలకే పదవులు ఇస్తోంది. చంద్రబాబుకు-వైఎస్ జగన్‌కు ఉన్న తేడా అది’ అని గోరంట్ల చెప్పుకొచ్చారు.

 

Leave a Reply