‘టీడీపీ మంత్రుల రాజీనామా’… ‘అంతా తూచ్….’ మంత్రి ఆది

Share Icons:

అమరావతి ఫిబ్రవరి 16 :

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అమాంతం మారిపోయాయి. వాడీవేడి వాతావరణం నెలకొంది.

వైసీపీ,టీడీపీలు పోటీ పడి మరి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ తత్తరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రుల రాజీనామా విషయంలో ‘సై’ అంటూ ప్రకటించేసి నాలుక్కరుచుకుని అంతలోనే మాటమార్చేశారు.

ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన టీడీపీపై ఒత్తిడిని తీసుకొచ్చిందనడంలో ఎటువంటి అనుమానం లేదు.

అదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని జగన్ పార్టీ ఒత్తిడి పెంచేస్తోంది.

ఇలాంటి తరుణంతో జగన్‌పై విమర్శల వర్షం కురింపించడానికి మంత్రి ఆదినారాయణరెడ్డిని రంగంలోకి దింపారు. అమరావతిలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన ఎరక్కపోయి విలేకరుల చేతిలో ఇరుక్కుపోయారు.

జగన్‌పై ఆది నారాయణ రెడ్డి ఎప్పటి నుంచో వ్యక్తిగత రాజకీయ దాడి చేస్తూనే ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజీనామాల ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో మార్చి 5వ, తేదినే టిడిపి ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు.

ఇది ఇప్పటి షెడ్యూల్ కాదని ఎప్పటి నుంచో ఉందని వ్యాఖ్యానించారు. పైగా తామే ముందు రాజీనామా చేసిన వారమవుతామని చెప్పుకొచ్చారు. అలా విలేకరుల సమావేశం ముగించారు.

ఇంతలోనే తెలుగుదేశం నాయకులలో అంతర్మథనం మొదలయినట్లుంది. గంట కూడా గడవక ముందే మంత్రి ఆదినారాయణ రెడ్డి తిరిగి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ‘ఇందాక నేను చెప్పిందంతా తూచ్… కొట్టేసుకోండి… అది నా స్వంత అభిప్రాయమ’ని చెప్పి అక్కడ నుంచి తుర్రుమన్నాడు.

ఇదే అంశంపై సీనియర్ నాయకుడు రాజేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పిందంతా ఆయన సొంత అభిప్రాయని, పార్టీ అభిప్రాయం కాదన్నట్లు మాట్లాడారు.

మామాట : మంత్రి పాత్రధారుడే… సూత్రధారి చంద్రబాబే..

English Summary :
Marketing Minister Adi narayana Reddy announced that all TDP minister in center will be resigned on March 5th. But, with in one hour changed his voice. that is his own voice which is not connected to Party.

Leave a Reply