TRENDING NOW

ఇక గువ్వలపురాణం.. పృథ్వీ

ఇక గువ్వలపురాణం.. పృథ్వీ

హైదరాబాద్, నవంబర్ 08,

రాజకీయంగా సంచనాలకు తెరతీసిన సినీ నటుడు శివాజి విడుదల చేసిన గరుడ పురాణం స్కీం ఫక్కీలో హాస్యనటుడు, జగన్ మద్దతుదారుడు పృథ్వీ తాజాగా గువ్వలపురాణం పేరుతో కొత్త విషయాలను ప్రకటించారు.  ఇందులో భాగంగా పాలక టీడీపీ నేతల అవినీతి భాగోతాన్ని వచ్చే డిసెంబర్ నుంచి గువ్వలపురాణం పేరుతో విడుదల చేస్తానని పృథ్వీతెలిపారు. ఇప్పటికే తాను తేదేపా నేతల అవినీతి చిట్టాను సేకరించాన్నారు.  ఆ అంశాలను దశలవారిగా ప్రజలకు తెలియజేస్తానన్నారు.  కాగా, విశాఖలో జగన్ పై దాడి జరిగిన సందర్బంలో సీఎం  చంద్రబాబు వ్యవహరించిన తీరును పృథ్వీతప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడాన్ని కూడా విమర్శించారు.

మామాట: ఎన్నికలలోగా మరెన్ని పురాణ పూరణలు రానున్నాయో..

(Visited 34 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: