బూతుల మంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత…

Share Icons:

అమరావతి: ఇటీవల మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే వారిపై అసభ్య పదజాలంతో కూడా దూషణలు చేశారు. ఈ క్రమంలోనే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ…బూతులు మంత్రి అంటూ విరుచుకుపడ్డారు. నిబంధనల ప్రకారం తిరుమల ఆలయంలోకి అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన జగన్ పై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.

బూతుల మంత్రి కొడాలి నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బూతుల మంత్రి మాట్లాడినంత మాత్రాన చట్టం మారిపోతుందా? అని ప్రశ్నించారు. తిరుమలకు ఎప్పుడు వెళ్లినా డిక్లరేషన్ ఇస్తానని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వనందుకు జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో, కొడాలి నాని నోటికి జగన్ కళ్లెం వేయాలని చెప్పారు.

ఇక ఆంగ్ల భాష అవసరం గురించి మొదట స్పందించింది తమ పార్టీయేనని బొండా ఉమా అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం ‘మాతృభాష వద్దు’ అని అంటున్నారని బోండా ఉమా విమర్శించారు. ఆంగ్ల భాషను తామే కనిపెట్టినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చురకలంటించారు.

అటు ఏపీ రాజధానిగా ఉండేందుకు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చాక మాటమారుస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధానికోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం వంచించిదని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలను సీఎం జగన్ పొమ్మంటే, తెలంగాణ రమ్మంటుందని విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఇక తమ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం ప్రాధాన్యత కాదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తప్పుబట్టారు. ఆర్థిక మంత్రే ఇలా మాట్లాడితే… రాష్ట్ర భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. బుగ్గన వ్యాఖ్యలు జగన్ పాలనకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. అమరావతిని అడుగడుగునా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, రైతుల త్యాగాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పారు. రాజధానికి అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టేనని ఆలపాటి అన్నారు. చంద్రబాబుకు పేరు రాకూడదనే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని వీరు ఎలా పాలించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.

 

Leave a Reply