రాజధాని ఈశాన్యంలో ఉంటే కేసులు ఉండవని స్వామీజీలు చెప్పడం వల్లే….

ap cm jagan sweet warning to ministers
Share Icons:

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీనేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని వారు డిమాండ్ చేస్తూ….రాజధాని రైతుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు జాతకాల పిచ్చి పట్టుకుందని టీడీపీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

క్రైస్తవుడైన జగన్ కు హిందువైన ఆ స్వామీజీ జాతకాన్ని ఎలా చెప్పాడో.. ఆయన ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆలింగనం చేసుకున్నపుడే ఆ స్వామీజీ గౌరవాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. రాజధాని ఈశాన్యంలో వుంటే మంచిదని.. ఎలాంటి కేసులు ఉండవంటూ స్వామీజీల మాటలతో జగన్ ప్రజల్లో ఆందోళనలు రేపుతున్నారని ఆరోపించారు. రైతులు నిర్వహించిన రహదారి దిగ్బంధంలో ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై జరిగిన దాడిని స్టేజి మేనేజ్డ్ డ్రామా అని వర్ల పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి, మరో ఎమ్మెల్యే వాహనాలను పక్కకు పంపించిన పోలీసులు పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు ప్రజల మధ్యకు పంపించారని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ కు టైమ్ దగ్గర పడిందని ‘రావాలి జగన్… కావాలి జగన్’ అని జైలు గోడలు పిలుస్తున్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “జగన్ మోహన్ రెడ్డి గారూ… మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్… కావాలి జగన్ అని” అంటూ సెటైర్లు వేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు, జేఏసీ ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేస్తూ రాష్ట్రంలో మిలిటరీ పాలన చేస్తున్నారని విమర్శించారు. నియంతృత్వ ధోరణి కలిగిన ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారని… నీ పతనం కూడా కూడా మొదలైంది జగన్మోహన్ రెడ్డిగారూ అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతుల నుంచి చిందుతున్న రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారిందని అన్నారు.

 

Leave a Reply