వైసీపీలోకి సీమ టీడీపీ నేతలు….బాబుకు గట్టి దెబ్బే..

tdp former mla ready join to ysrcp
Share Icons:

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన, వైసీపీలోకి వలసల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. కడప .. ప్రకాశం జిల్లాల నుండి ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ నుండి వైసీపీలో చేరారు. ఇక, ఇప్పుడు అనంతపురం శింగనమల నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీలో చేరనున్నారు. ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలున్నాయని సమచారం.

ఇప్పటికే పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల గత కొన్ని రోజులుగా టీడీపీని వీడుతారని ప్రచారం జరిగింది. అందుకే మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ సమయంలో శమంతకమణి శాసనమండలికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న శమంతకణి.. ఆమె కుమార్తె యామినీ బాల వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

ఇక శమంతకమణి తొలిగా కాంగ్రెస్ నుండి 1985లో పోటీ చేసి ఓడారు. తిరిగి 1989లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన శమంతకమణి కాంగ్రెస్ అభ్యర్ధి ..ప్రస్తుత పీసీసీ చీఫ్ శైలజానాద్ చేతిలో ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో శమంతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతి పైన గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వంలో విప్ గా పని చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు.  ఇక అప్పటినుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఈ ఇద్దరు, నాలుగు రోజులుగా వారిద్దరూ తమ అనుచరులతో మంతనాలు సాగించారు. వారు సైతం వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో.. వారు వైసీపీలో చేరాలని నిర్ణయించారు.

కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్‌బై చెప్పబోతున్నారు. త్వరలోనే ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ధీటైన నాయకత్వ లోటును ఎదుర్కొంటోన్న కర్నూలు జిల్లాలో టీడీపీకి ఇది విఘాతమేనని అంటున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని పార్టీ అగ్ర నాయకత్వాన్ని తప్పుపడుతున్నందునే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తోందని బీసీ జనార్ధన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం.

 

Leave a Reply