టీడీపీ నేతలు ‘గజినీ’లే…

Share Icons:

హైదరాబాద్, 21 జూలై:

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గజినీ సినిమాలో హీరో సూర్యకి ఏవిధంగా మెమరీ లాస్ ఉందో, అలాగే టీడీపీ నేతలకు కూడా ఉంది కాబోలు అని విమర్శించారు.

టీడీపీ నేతలందరు కన్వినెంట్ మెమరీ లాస్ సిండ్రోమ్’ని డెవలప్ చేసుకున్నారని, అంటే సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని మర్చిపోయినట్టుగా వారు నటిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే సమయానికి, సందర్భానికి అనుకూలంగా తమ జనసేన పార్టీ మాట మార్చదని, ఏది కరెక్ట్ అయితే దానికే జనసేన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

ఇక బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాని పక్కనపెట్టింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా మీరు ఎప్పటికీ మాట మర్చారనే నమ్మకం మీకు ఉందా అంటూ టీడీపీ నేతలను ఆయన ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా ఎంపీ గల్లా జయదేవ్ గతంలో మాట్లాడిన మాటలు, నిన్న పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు రెండింటిని క్లబ్ చేసి మరో ట్వీట్ చేశారు.

మామాట: అవకాశాన్ని బట్టి మాట మార్చే వాళ్లే రాజకీయనాయకులు పవన్….

Leave a Reply