కల్లుతాగిన కోతుల్లా వైసీపీ నేతలు…అవినీతిలో ఆరితేరిన నేతలు…

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: గత రెండు మూడు రోజులుగా ఐటీ దాడులకు టీడీపీ నేతలకు సంబంధం ఉందంటూ , టీడీపీ అవినీతి  బయటపడిందని వైసీపీ నేతల విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ నాయకురాలు అనురాధా స్పందించారు. అసలు ఐటీ దాడులకు, టీడీపీకి సంబంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా టీడీపీ నేతల పేర్లు ప్రస్తావనకు రాకపోయినా సరే వైసీపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా తమ పార్టీకి అవినీతి మరకలను అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతిలో ఆరితేరిన నేతలు తమ అధినేతను విమర్శించడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. ఇక తమ పార్టీ అవినీతి మాట అటుంచి వైసీపీ అధినేత జగన్ కేసులపై, అవినీతిపై చర్చకు రాగలరా అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు పంచుమర్తి అనూరాధ . ఇక వైసీపీ నేతలు వారే దొంగలై పక్క వాళ్ళను దొంగా, దొంగా అంటున్నారని ఆమె ఆరోపించారు . దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా టీడీపీకి అంటగట్టడమేంటని నిలదీశారు .

2012 నుంచి జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు అని , ఇక జగన్ కు కోర్టు అక్షింతలు వేస్తున్నా అక్రమాస్తుల కేసులో జగన్ గైర్హాజరవుతున్నారన్నారు. టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు .ఇక సీఎం జగన్ మొత్తం 16 కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేసిన అనూరాధ ఈ విషయాలపై వైసీపీ నేతలు నోరు మెదపరేం అని విమర్శించారు

సవాల్ విసిరితే సమాధానం చెప్పలేని వైసీపీ నేతలు టీడీపీ నేతలను విమర్శించటం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 విచారణలు జరిపి ఏమీ చేయలేకపోయారన్నారు.

ఇక వైసీపీ నేతలు ఈ దాడులను ఉద్దేశించి చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం తవ్వే కొద్దీ బయటకు వస్తుందని విమర్శలు చేస్తుంటే అసలు టీడీపీకి ఏం సంబంధం ఉందని వైసీపీ జప్ఫాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఐటీ దాడులకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని బొండా ఉమా ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అప్పట్లో వైఎస్ఆర్ 26 కమిటీలు వేసినప్పటికీ ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని బోండా ఉమ గుర్తు చేశారు .

 

Leave a Reply