మండలి సెక్రటరీని బెదిరించి సెలక్ట్ కమిటీ ఫైల్‌ని వెనక్కి పంపారు…

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్‌కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇచ్చాయి. ఇక ఈ ఫైల్ ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో మళ్లీ శానసమండలి చైర్మన్‌ వద్దకు ఫైలు చేరింది. దీంతో శాసనమండలి కార్యదర్శిని ఏపీలోని శాసనమండలి సభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ లు కలిశాయి.

రూల్‌ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఫైల్‌ మీద రాసి మండలి కార్యాలయ కార్యదర్శి తిప్పి పంపినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ తరువాత స్టెప్ వెయ్యటానికి ప్రయత్నం చేస్తుంది. ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ మరియు సిఆర్డిఎ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం కొత్త మలుపు తీసుకుంది. మొదట నుండే అధికార పార్టీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు చెల్లదని, రూల్ కు వ్యతిరేకం అని చెప్తున్న క్రమంలో ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని తేల్చి చెప్పారు. మండలి కార్యదర్శికి సైతం లేఖలు సైతం రాశారు.

ఇక రూల్‌ 154 కింద చైర్మన్‌ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు మండల కార్యదర్శికి తెలియజేశాయి . సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు.మళ్ళీ చైర్మన్‌ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని కూడా టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

సెలక్ట్‌ కమిటీ అంటే ప్రభుత్వం భయపడుతుంది అని అందుకే మండలి సెక్రటరీని బెదిరించి సెలక్ట్ కమిటీ ఫైల్‌ను వెనక్కి పంపేలా చేశారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళితే బిల్లు పరిస్థితి అంధకారంలో పడుతుందనే ఉద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కానీ ప్రభుత్వం మాత్రం సెలెక్ట్ కమిటీ ఏర్పాటే రూల్స్ కు విరుద్ధం అని చెప్తుంది.

 

Leave a Reply