బిల్స్ సెలక్ట్ కమిటీకి వెళ్లినట్లు ప్రభుత్వమే చెప్పింది….

Share Icons:

అమరావతి: బులిటీన్ విడుదల తరువాతే సెలక్ట్ కమిటీ భేటీ పని మొదలవుతుందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సెలక్ట్ కమిటీలో మంత్రులు, వైసీపీ సభ్యులు లేకపోతే నష్టం లేదని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు సమావేశాలకు కమిటీ సభ్యులు హాజరు కాకపోతే కొత్తవారిని నియమించే అధికారం చైర్మన్‌కు ఉందన్నారు.

సభ ప్రొరోగ్ అయినా బిల్స్ లైవ్‌లోనే ఉంటాయని, ఆ సమయంలో ఆర్డినెన్స్ ఇస్తారని అనుకోవడం లేదని యనమల అన్నారు. ఆర్డినెన్స్ ఇవ్వాలంటే గవర్నర్ ఆమోదించాలని, ఆర్డినెన్స్ ఇచ్చినా మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుగా పెట్టాలన్నారు. బిల్స్ సెలక్ట్ కమిటీకి వెళ్లినట్లు ప్రభుత్వం న్యాయ స్థానాలకు తెలిపిందని, ప్రభుత్వం సెలక్ట్ కమిటీపై మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. మండలిలోని అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకునే అధికారం చైర్మన్‌కు ఉందని యనమల స్పష్టం చేశారు.

అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాడిస్ట్ వ్యక్తి సీఎం అవడం మన దౌర్భాగ్యం అని ఆయన వ్యాఖ్యానించారు. 29 గ్రామాల ఉద్యమంగా చిత్రీకరించడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సోమవారం నాడు.. రాజధాని గ్రామాలలో రైతులకు బుచ్చయ్య, రాజమండ్రి ప్రాంత రైతులు సంఘీభావం‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం నాశనం అవుతోందన్నారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం నేడు పోరాటం సాగుతోందన్నారు.

‘అసలు రాజధాని ఎందుకు మారుస్తున్నారో జగన్ ప్రజలకు చెప్పాలి. వేల కోట్లు అభివృద్ధి పనులు అమరావతిలో జరిగాయి. విశాఖపట్నంలో భూదందాలు చేసేందుకే రాజధాని మార్పు నిర్ణయం. ప్రభుత్వానికి సంపద సృష్టించే ప్రాంతం అమరావతి. ఈ ఎనిమిది నెలలల్లోనే జగన్ అరవై‌ వేల కోట్లు అప్పు తెచ్చారు. ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? కానీ పధకాల పేరుతో పప్పు, బెల్లం పంచారు. అమ్మ ఒడి పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసి కార్పొరేషన్‌ల రుణాలను మళ్లించారు” అని బుచ్చయ్య చెప్పుకొచ్చారు.

 

Leave a Reply