తాడేపల్లిలో జగన్ ఇల్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందా?

Share Icons:

అమరావతి: రాజధాని విషయంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కంపెనీలకు చెందిన అంశమన్నారు. తాడేపల్లిలో జగన్ ఇల్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందా అని ప్రశ్నించారు. 2013లో మా అల్లుడు భూములు కొంటె కూడా ఆరోపణలా అని యనమల నిలదీశారు.ఇక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సంపద ముఖ్యమని.. సంపద సృష్టించేందుకు ఐదేళ్ల పాటు కృషి చేశామన్నారు. సంపద సృష్టించే సిటీ ఏపీలో లేదని యనమల స్పష్టం చేశారు. వారి సంపద పెంచుకోవడానికే వైసీపీ నేతలు రాష్ట్రంలో చిచ్చుపెడుతున్నారన్నారు. అమరావతి రైతులకు సంబంధించింది మాత్రమే కాదని.. రాజకీయాలు, పరిపాలనను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. రాజధాని తరలింపు వార్తలతో పెట్టుబడులు రావట్లేదని యనమల పేర్కొన్నారు

ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే సంపద ముఖ్యమని యనమల స్పష్టం చేశారు. ఆదాయం లేకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఏపీకి ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేశామని.. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి.. మిగతా రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా జగన్‌ నిర్ణయం తీసుకున్నారని యనమల విమర్శించారు. తెలంగాణకు హైదరాబాద్‌ ఉందని.. మనకు అలాంటి అవకాశం లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విశాఖ డెవలప్‌ జరుగుతూనే ఉందన్నారు. టీడీపీ హయాంలో విశాఖకు చాలా పరిశ్రమలు వచ్చాయన్నారు. అభివృద్ధి చెందుతున్న విశాఖను చెడగొడతారా? అని యనమల ఫైర్ అయ్యారు. ఆర్థిక వృద్ధిరేటు 4 శాతం పడిపోయిందని అన్నారు.

అదేవిధంగా రాజధాని విషయంలో కేంద్రానికి సూచనలు చేసే అధికారం ఉంటుందని, కేంద్రం డైరెక్షన్స్ రాష్ట్రం పాటించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానికి ఉంటుందన్నారు. రాజధాని వ్యవహారం విభజన చట్టంలో ఉందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు అయ్యిందని యనమల స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీకి ఉండే అవగాహన ఏంటని ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వక ముందే జగన్ ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. రాజధానిపై కేబినెట్ సబ్ కమిటీ జీవోనే చెల్లదన్నారు.

 

Leave a Reply