సీఎం రమేశ్ పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ: టీడీపీ నేత

tdp-leader-varadarajula-reddi-fires-on-cm-ramesh
Share Icons:

కడప, 9 జూన్:

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు.

అయితే అలాంటి పార్టీలో ఇప్పుడు గ్రూపుల సంస్కృతి మొదలయ్యింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇవి మరింత ఎక్కువయ్యాయి.

దాదాపు రాష్ట్రంలోని అన్నీ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇలాంటి టీడీపీ గ్రూపు తగాదాలకి పెట్టింది పేరైనా కడప జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఒక వర్గంపై మరో వర్గ నేతలు విమర్శలు చేసుకోవడంలో ఈ జిల్లాలోని నేతలు ముందున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఇంచార్జీ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో గెలిచే సత్తా రమేష్‌కు లేదని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దయవల్లనే రాజ్యసభ సభ్యుడయ్యారని ఆయన శనివారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సిఎం రమేష్ పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు.

ఇక రమేష్ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, నామినేటెడ్ పదవులతో పబ్బం గడుపుకునే వారికి వర్గ రాజకీయాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

కాగా, వరదరాజులు రెడ్డికి,  సీఎం రమేష్‌కు మధ్య గత రెండేళ్లుగా వైరం కొనసాగుతోంది. ఆ వైరం రాజకీయపరమైందే కాకుండా వ్యాపారపరమైందని కూడా భావిస్తున్నారు. ఇక తనకు పోటీగా రమేష్ లింగారెడ్డిని ప్రోత్సహిస్తున్నారని కోపం కూడా వరదరాజులు రెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకరకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు ప్రొద్దుటూరులోని కాకుండా కడప జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి.

మామాట: అధినేతకి చుక్కలు చూపిస్తున్న కడప నేతలు…

Leave a Reply