కర్నూలులో దారుణం: టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణహత్య…

Share Icons:

కర్నూలు, 22 మే:

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ నేత శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లా డోన్ మండలం, తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్ ను అడ్డగించిన దుండగులు రాడ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.

దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య చేసిన వెంటనే దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఇక శేఖరరెడ్డి  మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితులని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలని రంగంలోకి దించాయి.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒక్కరోజు ముందు ఈ హత్య చోటుచేసుకోవడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శేఖర్ రెడ్డి…ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు.

మామాట: హత్య ఏ ఉద్దేశంతో జరిగిందో

Leave a Reply