మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తాం

TDP leader l ramana comments on share of seats in mahakutami
Share Icons:

హైదరాబాద్, 24 అక్టోబర్:

రెండు మూడు రోజుల్లోపు సీట్ల సర్దుబాటు అవుతుందని, పార్టీల వారీగా సంఖ్యను అనుకుని, మూడు విడతలుగా కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… తొలి విడతలో 50 నుంచి 60 మంది అభ్యర్థులను, రెండో విడతలో ముప్పై, మూడో విడతలో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.

ఇక టీడీపీ ఆంధ్రాపార్టీ అని కేసీఆర్, ఆయన కుటుంబం వ్యాఖ్యలు చేయడంపై రమణ స్పందిస్తూ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల హృదయాల్లో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే రాజకీయనాయకుడని అన్నారు.

అలాగే హైదరాబాద్‌కు హైటెక్ సిటీ తీసుకురావడం ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి బాబు అని కొనియాడారు. మహాకూటమి సాధించే విజయంలో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని, కేసీఆర్ అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడేందుకే తమ మహాకూటమి ఏర్పడిందని తెలిపారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు తమకూటమి పాటుపడుతుందని వ్యాఖ్యానించారు.

మామాట: అప్పటికి టీఆర్ఎస్ నేతలు మూడో విడత ప్రచారం కూడా ముగిస్తారు

Leave a Reply