ఆయనకి వారిద్దరూ జోడెద్దుల్లా పనిచేస్తున్నారు….

TDP leader jupudi prabhakar fires on jagan and pawan
Share Icons:

విజయవాడ, 24 జూలై:

వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి జోడెద్దుల్లా పనిచేస్తున్నారని తెలుగుదేశం నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ మోదీ ప్రభుత్వంపై పోరాడుతుంటే జగన్‌,పవన్‌లు ఆయనను రక్షించడానికి, ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

అసలు మోదీ మోసం చేసినా వీరు నోరెత్తడం లేదని, పైగా టీడీపీని విమర్శిస్తున్నారని, వీరికి ఆంధ్రా ప్రయోజనాలతో సంబంధం లేదని, కేవలం వారి వ్యక్తిగత స్వార్థం కోసమే పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అలాగే మొన్న చంద్రబాబుపై పవన్ చేసిన ఆరోపణలు గురించి కూడా ఆయన స్పందించారు. తనకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆ విషయాన్ని పత్రికల్లో రాపించారని దీంతో తాను మోదీ వద్దకు వెళ్లానని పవన్‌ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అయితే 60-70 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తానని అప్పట్లో పవన్‌ చెప్పారని, కానీ అప్పటికి జనసేన పార్టీ రిజిస్ట్రేషన్‌ కూడా జరగలేదని అలాంటప్పుడు ఎన్నికల్లో ఆయన ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు.

ఇక అమరావతి కోసం 120 పంటలు పండే భూములను తీసుకుంటున్నారని పవన్‌ విమర్శించారని, తనకు తెలిసి ఒక భూమిలో రెండు లేక మూడు పంటలు మాత్రమే పండుతాయని మరి 120పంటలు పండడం ప్రపంచంలో తానెక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. అలాగే ప్రత్యేకహోదాపై టీడీపీ యూ టర్న్‌ తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వమే యూ టర్న్‌ తీసుకుందని అన్నారు.

మామాట: ప్రజలకి తెలుసులే ఎవరు యూ టర్న్ తీసుకున్నారో?

Leave a Reply