మేము అధికారంలోకి రావోద్దని పోలీసులు గట్టిగా మొక్కుకోవాలి….

Share Icons:

అనంతపురం: ఇటీవల పోలీసులపై  టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటానంటూ జెసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మండిపడ్డ పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెసీపై 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ క్రమంలోనే తాజాగా జేసీ సోదరుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే… తమపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు కూడా జైలుకెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రావొద్దని పోలీసులు గట్టిగా మొక్కుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పోలీసుల యాక్షన్‌కు మా రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కేసులు పెట్టి లోపలేయడం తప్ప… పోలీసులు ఏం చేయలేరని అన్నారు. తాడిపత్రిలో ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే మహిళలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దివ్యవాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజా మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ జైల్లో ఉంటే ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేశారని…వాళ్లు మహిళలన్న విషయం రోజాకు తెలియదా అని ప్రశ్నించారు. రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని దివ్యవాణి హెచ్చరించారు. మహిళలపై లాఠీచార్జ్‌ జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ప్రభుత్వ పదవుల కోసం నోరు మెదపవా? అని దివ్యవాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘రోజా మగతనాల గురించి మాట్లాడొద్దు…మేము కూడా నీలా మాట్లాడగలం..మాకు సంస్కారం ఉంది’’ అని ఆమె అన్నారు.

 

Leave a Reply