కోర్టుకెళ్ళేందుకు అసెంబ్లీకి సెలవిచ్చారు…

war words between devineni uma and vijayasai reddy
Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారని విమర్శించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి శాసనమండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేస్తామన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని అన్నారు.

సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. సీఎం జగన్‌ కోర్టుకు హాజరుకావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.30 కోట్ల భారం పడుతుందన్నారు.

ఇక శాసనమండలి దండగైనపుడు శాసనసభ దండగ కాదా? అని ఎమ్మెల్సీ దొరబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులు వేసేందుకు ఎంత ఖర్చు చేశారని, సీఎం ఇంటికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారని దొరబాబు ప్రశ్నించారు. అనంతరం బచ్చుల అర్జనుడు మీడియాతో మాట్లాడుతూ.. మండలి రద్దు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనడం సిగ్గుచేటన్నారు. సీఎం జైల్లో ఉంటే అక్కడి నుంచే పరిపాలన చేస్తారా? అని బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. అధికారబలంతో జగన్ చేసిన నిర్ణయాలు చెల్లవన్నారు. మండలి రద్దయ్యే లోపు జగన్‌ జైల్లో ఉంటాడని అశోక్ బాబు అన్నారు.

చట్టాన్ని అతిక్రమించి చేసిన బిల్లు కాబట్టే మండలి వ్యతిరేకించిందన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలకు తెలుసునని అన్నారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సీఎం తీరును తప్పుపట్టారు. విశాఖ వాసులు 507 మంది మాత్రమే శివరామకృష్ణన్ కమిటీకి తమ అభిప్రాయం చెప్పారని తెలిపారు. కానీ, 5038 మంది రాష్ట్ర ప్రజలు విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని కోరుకున్నారని చెప్పారు. ఆ రోజు శాసన మండలి కూడా అదే నిర్ణయం తీసుకుందన్నారు. రాజధాని తరలింపునకు సంబంధించి చట్ట సవరణ చేయాలంటే సెలెక్ట్ కమిటీ చేస్తుందని పేర్కొన్నారు.

 

Leave a Reply