తలసానికి సవాల్ విసిరిన టీడీపీ నేత…

Share Icons:

విజయవాడ, 16 ఫిబ్రవరి:

ఇటీవల ఏపీ పర్యటనకి వచ్చి టీడీపీ, చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తలసానిపై ఏపీ వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల మురళి మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని… ఏపీలో వైసీపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.

అసలు బీసీలకు ఒక్క పాలకమండలిని కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే… అది తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

ఇక ప్రభుత్వం ఏర్పడి ఎన్నో రోజులు అవుతున్నా ఇంతవరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం చేతగాని మీరు… ఏపీకి వచ్చి నీతులు చెబుతున్నారా? అంటూ మండిపడ్డారు. మరోసారి మంత్రి కావాలనే ఆశతోనే తలసాని నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, తెలంగాణలో బీసీలను విస్మరిస్తున్న మీరు… పక్క రాష్ట్రానికి వచ్చి, బీసీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మురళి హెచ్చిరించారు. బీసీలకు ఎవరు న్యాయం చేశారనే దానిపై మార్చి 2న హైదరాబాదులో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

మామాట: మరి ఈ సవాల్‌పై తలసాని స్పందిస్తారా

Leave a Reply