మూడుచోట్ల మమ్మల్ని చంపాలని చూశారు….

tdp leader bonda uma ready to join ysrcp
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ అయ్యారు. నిన్న మాచర్లలో జరిగిన ఘటనపై మరోసారి స్పందించారు. మాచర్లలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన హైకోర్టు న్యాయవాది పారా కిశోర్ పరిస్థితి విషమంగా ఉందని ఉమా తెలిపారు. తమను చంపాలని మూడు చోట్ల ప్రయత్నాలు చేశారని చెప్పారు.

ఇక ‘అదృష్టవశాత్తు నేను, బుద్ధా వెంకన్న ప్రాణాలతో బయటపడ్డాం. హైకోర్టు న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.’ అని బోండా ఉమా తెలిపారు. తమపై హత్యాయత్నం స్కెచ్ మొత్తం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగిందని బోండా ఉమా అన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

‘పోలీసులుకు మేము సమాచారం ఇచ్చి బయలు దేరాం. వారి నుంచి పిన్నెల్లి వర్గాలకు సమాచారం వెళ్లింది.. అందుకే వారు పధకం ప్రకారం దాడి చేశారు. ప్రభుత్వం తన‌ సొంతానికి పోలీసు వ్యవస్థను‌ వాడుకుంటుంది. మాజీ సీఎం‌ చంద్రబాబు వచ్చినా డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలేదు. అడిషనల్ డిజికి అన్నీ వివరించాం.. అయినా‌ విచారణ జరగలేదు’ అని బోండా ఉమా ఆరోపించారు.

అటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన వైసీపీ అరాచకాలపై హైకోర్టులో పిటిషన్లు వేశామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. 12 జెడ్పీటీసీలు, 470 ఎంపీటీసీల్లో ఎన్నికలు రీషెడ్యూల్‌ చేయాలని కోరినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనూ పత్రాలు చించేసే దుస్థితి నెలకొందన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లారని హోంమంత్రి అబద్ధాలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇవ్వబట్టే అది వైసీపీకి చేరిందని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు నిరూపిస్తే హోంమంత్రి రాజీనామా చేస్తారా?. పోలీసులు యూనిఫాం తీసేసి వైసీపీ దుస్తులు ధరిస్తే మంచిది’ అని అశోక్‌బాబు చెప్పుకొచ్చారు.

 

Leave a Reply