టీడీపీకి షాక్…వైసీపీలో చేరిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే

tdp, ysrcp candidates contest in visakha loksabha in 2019 elections
Share Icons:

హిందూపురం, 8 డిసెంబర్:

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. హిందూపురంలో మొన్నటి వరకు ఎమ్మెల్యే బాలకృష్ణకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన ఆ  పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఘనీ మీడియాతో మాట్లాడుతూ..30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ.. పార్టీకి కృషి చేసినా.. తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న కారణంతో పార్టీని వీడినట్లు తెలిపారు.నాలుగేళ్లుగా మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.

కాగా, హిందూపురం ఎమ్మెల్యేగా 2004, 2009లో అబ్దుల్ ఘనీ టీడీపీ తరపున పోటీచేసి గెలిచాడు. 2014లో బాలకృష్ణ కోసం తన స్థానాన్ని వదులుకున్నాడు. 2019లో ఎన్నికల్లోనూ ఆ టికెట్ మళ్లీ బాలకృష్ణకు దక్కనుంది. దీంతో ఇంకెప్పటికీ తనకు టీడీపీ నుంచి టికెట్ లభించే అవకాశం లేకపోవడం.. అదే సమయంలో వైసీపీ నుంచి టికెట్ ఆఫర్ చేయడంతో.. ఆయన ఈ రోజు ఆ పార్టీలో చేరారు.

మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురం నుండి పోటీచేసిన నవీన్ నిశ్చల్‌కి ఈ ఏడాది టికెట్ ఇవ్వనని ఇప్పటికే జగన్ తేల్చి చెప్పేశారట. దీంతో పార్టీలో చేరిన ఘనీకి టికెట్ ఇచ్చి హిందూపురం నుండి పోటీలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. 

మామాట: ఇది టీడీపీకి షాక్ అనే చెప్పాలి

Leave a Reply