ఆనం పార్టీ మారడం ఖాయమేనా..?

TDP leader aanam ramnarayanareddy is change the party
Share Icons:

నెల్లూరు, 13 జూన్:

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

మంగళవారం రాత్రి కొందరు మీడియా ప్రతినిధులు పార్టీ మారుతున్నారా అని ఆనంని అడగగా… ఎన్నో పదవులు చేపట్టాను.. సమర్థంగా పనిచేశాను.

కానీ గుర్తింపు, గౌరవం లేని చోట ఉండలేనని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగడం ఖాయమని అనిపిస్తోంది.

అలాగే ఆయన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతంలోని పలువురు టీడీపి, కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. తొలుత ఆయన కోటపోలూరు వెళ్లి, కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న చెంగాళమ్మ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్, తెలుగుదేశం నాయకుడు ఇసనాక హర్షవర్దన్ రెడ్డిని పరామర్శించారు .

ఇక ఆయనతో గంట పాటు చర్చలు జరిపిన తర్వాత ఆనం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా  కుటుంబ సన్నిహితులు, అనుచరులు, అభిమానులు ఉన్నారని, వారందరితో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నేత, జిల్లా గ్రంథాయల సంస్థ మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డితో కూడా ఆయన చర్చించారు .

మామాట: అంతే కదా గుర్తింపులేని చోట ఉండటం అనవసరమే…

Leave a Reply