తుది శ్వాస వరకు టీడీపీలో ఉంటానంటున్న మహిళా నేత

Share Icons:

అమరావతి:

 

ఇటీవల బీజేపీ ఆపరేషన్ కమలం పేరుతో ఏపీలో టీడీపీ నేతలనీ తమ పార్టీలోకి లాగేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చాలామంది నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా, మరికొందరు బీజేపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా ఉన్న సాధినేని యామిని, నటి దివ్యవాణిలు బీజేపీలోకి వెళ్ళతారని  ప్రచారం జరుగుతుంది.

 

ఈ క్రమంలో పార్టీ మార్పు ఊహాగానాలపై దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు. తుదిశ్వాస వరకూ టీడీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని, సోషల్ మీడియాలో తాను బీజేపీలో చేరుతున్నా అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు.

 

మరోవైపు యామిని మాత్రం పార్టీ మార్పు ఊహాగానాలపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో…కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

 

Leave a Reply