గ్రేటర్‌లో 10 సీట్లు కావాలంటున్న టీడీపీ…!

Share Icons:

హైదరాబాద్, 11 సెప్టెంబర్:

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పొత్తుకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తుకి సంబంధించి అధికారికంగా ఎటువంటి విషయం బయటపడనప్పటికి అంతర్గతంగా ఇరు పార్టీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. రాష్ట్రంలో ఎవరు ఎన్ని సీట్లు తీసుకోవాలనే విషయమై పార్టీ అగ్రనేతలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు 10 స్థానాలను కేటాయించాలని టీడీపీ కోరుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఉప్పల్, మలక్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలను కేటాయించాలని కాంగ్రెస్ ను టీడీపీ అడుగుతోంది.

ఇక టీడీపీ డిమాండ్‌తో ఈ 10 నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. టీడీపీ అడుగుతున్న స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రముఖులు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత  ఎన్నికల్లో నగరంలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు.. టీడీపీ 9, ఎంఐఎం 7, బీజేపీ 5, టీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి.

మామాట: మరి టీడీపీ డిమాండ్‌ని కాంగ్రెస్ ఒప్పుకుంటుందో లేదో?

Leave a Reply