కాంగ్రెస్-టీడీపీ కలయిక లుకలుకలు

Share Icons:

దొంగలు పడిన ఆరు మాసాలకు  కుక్కల హడావుడి అని మనకో సామెత ఉంది. అదిపుడు ఎందుకు గురుతొస్తోందంటే.. మన రాష్ట్రంలో రాజకీయుల పరిస్థితి చూస్తే జరిగిపోయిన పెళ్లికి పెద్దలను ఏలా ఒప్పించాలో తెలియక తికమక పడే యువజంటలాగా ఉంది.  ఇక్కడ కాంగ్రెస్ జీరో- అక్కడ టీడీపీ నోమోర్… మరీ కదనకుతూహల రాగం ఎందుకో..

[pinpoll id=”60606″]

వచ్చే ఎన్నికలు అవి లోక్  సభకైనా, తెలంగాణ, ఏపీలలో శాసనసభకైనా.. పరస్పరం సహకరించుకోవాలని, వీలయితే కూటమిగా పోటీచేయాలని తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ సూత్రప్రాయంగా అందగీకరించాయని అందరికీ తెలుసు. వివాదమల్లా ఎన్ని సీట్లు,, ఎక్కడెక్కడ పోటీచేయాలో తేల్చుకోవడమే. ఇప్పటికే దీనిపై ఇరుపార్టీలలో కసరత్తుకూడా జరుగుతోంది. ఇంతా చేసి అటు తెలుగు దేశం ఇటు కాంగ్రెస్ పార్టీలు వీటికి వంత పాడే పత్రికా మిత్రులు మాత్రం రోజుకో వంట వండి పాఠకులకు వేడి తగ్గకుండా అందించడమే విశేషం.  తెలుగుదేశం సారథి చంద్రబాబు చెప్పేది చేయడు, మనసులోది చెప్పడని లోకానికంతా తెలుసు. ఆయన మనసులోని మాటలేవో పుస్తకంగా కూడా వేసుకున్నారుకదా… తాజాగా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు వ్యవహారం కూడా నిర్థారణ జరిగిపోయినా, అందువలన వచ్చే నష్టాన్ని నివారించడానికి ఇరు పార్టీలు తమ వంతు నాటకాన్ని రక్తికట్టిస్తూ ఉంటే, మిత్ర పత్రికలు కూడబలుక్కుని పక్కవాయిద్యాలను ఇంపుగా వాయిస్తున్నాయి.. ఇప్పటి నుంచీ పొత్తు,  ఉంది, లేదు, తూచ్, మీరా మాట్లాడేది, అలా మాట్లాడకూడదని తెలియదా, బయట నోరు విప్పొద్దిండి, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు, పొలిట్ బ్యూరోలో చర్చించకుండానే ప్రకటనలా, క్రమశిక్షణ తప్పితే వేటు ఖాయం వంటి హెచ్చరికలు పుంఖాను పుంఖాలుగా తెలుగు దేశం శంఖం నుంచీ జాలువారుతాయి. ఆ తీర్థం పుచ్చుకున్నవారు మరి మాట్లాడరు… ఇతంతా వినీ వినీ విసిగిపోయిన జనం తీరా ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా… పెద్దగాపట్టించుకోరు… ఇదంతా పాత వార్తలే కదా అని లైట్ తీసుకుంటారనే ఆలోచనతో చంద్రబాబు బృందం ఆడుతున్న పొత్తుల నాటకం ఇటీవల అనేక వేదికలపై బాగానే రక్తి కడుతోంది. తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ. మరి ఇపుడు దాని గురించీ ఎందుకు ఇంకా పట్టుక పీకులాడుతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ప్రశ్న. ఈ సమర్థింపు నేమనాలి… తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఆర్కే ఎందుకు ఉబలాటపడుతున్నారో..

ఇపుడేమన్నా కాంగ్రెస్ విధానాలు మారిపోయాయా… అదే పాత సిద్ధాంతాల పునాదులపైనే కదా కాంగ్రెస్ నడుస్తోంది. మరి రాజీ పడడం ఎట్లా, పైగా, ఆనాడు విభజన సమయంలో ఏపీలో ప్రజలు ఉన్నారని, వారి మనోభావాలు తెలుసుకోవాలని, తదనుగుణంగా విభజన చట్టాన్ని రూపొందించాలని అధిస్టానం భావించిందా.. లేదు. సోనియా గానీ, రాహుల్ గాని, ఆనాటి ప్రధాని మన్మోహన్ గాని, చిట్ట చివరికి ఏపీ కి చెందిన కాంగ్రెస్ నాయకులు విభజన బిల్లులో ఏపీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకునే చొరవ చూపించారా… పదవులకు రాజీనామా చేశారా లేదు. మరి అటువంటి వ్యక్తులతో, పార్టీతో ఇవ్వాళ తెలుగు దేశం ఎలా జట్టు కడుతుంది. ప్రజలు ఈ పరిణామాన్ని హర్షిస్తారా. అంతెందుకు మన్మోహన్ సింగ్ ఇప్పిటికైనా నోరు తెరిచి… అయ్యా మోదీ గారు, మీకు ముందు నేను ప్రధానిని, అపుడు నేను పార్లమెంటు సాక్షిగా, ఇచ్చిన హామీలు మీరు అమలుచేయాలి అని ప్రశ్నిస్తున్నారా, ఆ నాడు బిజేపీ ఐదు కాదు పదేళ్లు ఇస్తామన్నది.. ఎన్నికలు ముగిసిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఇపుడు మళ్లీ రాహుల్ మేము వస్తే ఇస్తాం అంటూ ప్రకటించి ఏపీ ప్రజలను గొర్రెలుగా భావిస్తున్నారా… అనే భావన జనబాహుళ్ల్యంలో ఉంది. ఒక వేళ రేపు ఎన్నికలు ముగిసిన తరువాత రాహుల్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక ఇంకో ఆర్థిక సంఘం చెప్పిందనో, లేదంటే అపుడు వారు ప్రధానిగా నిలబడడానికి మద్దతు ఇచ్చే  పిల్లపార్టీలు వద్దంటున్నాయని హోదా ఇవ్వక పోతే ఏపీ ప్రజలు ఎవరిని నిందించాలి. ఈ విషయంలో తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు రాజ్యాంగ బద్దమైన హమీ ఇచ్చే అవకాశం ఉందా. అది చట్టం ముందు నిలబడుతుందా, రాహుల్ తన మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపై చేయకపోతే అతని ప్రధాని పదవి రద్దయి పోతుందా… ప్రజలకు వివరణ కావాలి…

అయినా కాంగ్రెస్ వ్యతిరేకతతో జనించిన టీడీపీ, ఈనాడు పత్రికలు ఈ పొత్తుపై ఎందు కింత ఆసక్తి చూపుతున్నాయి, టీడీపీ – కాంగ్రెస్ పెళ్లికి పెద్దరికం వహిస్తున్న ఈనాడు రామోజీరావు  ఉద్దేశం ఏమిటో అని సామాజిక మాధ్యమాలలో పలు ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ టీడీపీ-కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఏ.పీ. లోని సామాన్య ప్రజానీకం ఏమను కుంటున్నదో..

 

మామాట:  పాలిట్రిక్స్ లో ఇవన్నీ సహజమప్పా… అంటారా…

Leave a Reply