టీడీపీ లో గో.చౌ. వ్యవహారం టీ కప్పులో తుఫాన్!

Share Icons:
  • చంద్రబాబును కలిసిన బుచ్చయ్య చౌదరి
  • చంద్రబాబును కలవడంపై సర్వత్ర ఆసక్తి

టీడీపీలో ఇటీవల చంద్రబాబు పై తీవ్రమైన ఆరోపణలు చేసి వార్తలలోకి వెక్కిన సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పు లో తుఫాన్ లాగా అయింది. గురువారం ఆయన పార్టీ అధినేత చంద్రబాబు ను కలిశారు. అంతకుముందు బుచ్చయ్య వ్యవహారంలో త్రీ సభ్య కమిటీ ని ఏర్పాటు చేసిన చంద్రబాబు బుచ్చయ్య ను కలిసి ఆయన అసంతృప్తికి కారణాలపై ఆయన తో చర్చించారు. వారు ఆయనతో భేటీ అయి విషయాలను చర్చించారు. వారి సూచనా మేరకు బుచ్చయ్య చౌదరి చందరబాబును కలిశారు. చంద్రబాబు తో భేటీ సందర్భంగా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మెత్తబడ్డ బుచ్చయ్య చౌదరి తన రాజీనామాను యోచనను విరమించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి కారణం కనుక్కోవడం కోసం ఇటీవల పార్టీ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబును కలిశారు. ఆయన వెంట టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ తదితరులు ఉన్నారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply