TRENDING NOW

తిరుగుబాటు బాటలో బ్ర‌హ్మానంద‌రెడ్డి!

తిరుగుబాటు బాటలో బ్ర‌హ్మానంద‌రెడ్డి!

నంద్యాల, మార్చి 16,

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు దగ్గరపడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలూ తమ అభ్య‌ర్ధుల జాబితాల‌ను ఖరారుచేసే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాలక తేదేపా దూకుడుగా మొదటి విడతలో ఇప్పటికే 126 మందితో జాబితా విడుదల చేసింది. అయిదే ఇదే ఇపుడు పార్టీ అధినేత చంద్రబాబుకు తల నొప్పికలిగిస్తోందని సమాచారం. జాబితాలో పేర్లున్నవారూ, పేర్లు లేనివారు కూడా టీడీపీకి హ్యాండిస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే…

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి కూడా చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీడీపీ అభ్య‌ర్ధుల జాబితాలో నంద్యాల సీటు పెండింగ్‌లో పెట్టారు చంద్ర‌బాబు. దీంతో ఈసారి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌ని వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి.

దీంతో తాజాగా అనుచ‌రుల‌తో స‌మావేశం అయిన బ్ర‌హ్మానంద‌రెడ్డి రెండో జాబితాలో త‌న చోటు ద‌క్క‌క‌పోతే, స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా పోటీ చేస్తాన‌ని టీడీపీ అధిష్టానానికి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇక‌ మ‌రోవైపు నంద్యాల టిక్కెట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. త‌న అల్లుడుడికి టిక్కెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో బ్ర‌హ్మానంద‌రెడ్డికి టిక్కెట్ క‌ష్ట‌మే అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నిడూ లేని విధంగా ఈ ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు పై టీడీపీ నేత‌లు తిరుగుబాటు చేస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

మామాట: ఇందులో ఏముంది.. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నారుకదా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: