టీడీపీలో ఆధిపత్య పోరు

Share Icons:

విశాఖపట్నం టీడీపీలోని విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంత్రులు చింతకాయల అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రభుత్వంపై విమర్శల చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ అయ్యన్నపై అధినేత చంద్రబాబుకు గంటా ఫిర్యాదు చేశారు. అయితే, గంటాతో తనకెలాంటి విభేదాలు లేవని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విశాఖ భూ వివాదం సమస్య సవ్యంగా పరిష్కారమై, బాధితులకు న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు.

Leave a Reply