TRENDING NOW

పెద్దాపురంలో సైకిల్ సవారీ కష్టమేనా…!

పెద్దాపురంలో సైకిల్ సవారీ కష్టమేనా…!

కాకినాడ, 14 మార్చి: 

ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరడంతో తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నరసింహం భార్య తోట వాణికి పెద్దాపురం టిక్కెట్‌ ఇవ్వడంతో హోమ్ మంత్రి చినరాజప్పకి గట్టి పోటీ ఎదురైంది.

కాగా, ఇటీవల నరసింహం ఆరోగ్య కారణాల వలన పోటీ నుండి తప్పుకుని తన భార్య వాణికి జగ్గంపేట టీడీపీ టిక్కెట్‌ ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి చేశారు. అయితే జగ్గంపేటలో బలమైన నేత నెహ్రూ ఉండడంతో టిక్కెట్‌ ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో నర్సింహం కుటుంబం వైసీపీలో చేరింది.  అటు పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న దవులూరి దొరబాబుకి కాకినాడ ఎంపీ టిక్కెట్‌ ఇస్తామన్న ఆఫర్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కాకినాడ పార్లమెంటు వైసీపీ సీటు ఇదివరకే ఒక ఐఆర్‌ఎస్‌ అధికారికి ఖరారు చేసినట్టు చెబుతున్నారు. దీంతో దవులూరి దొరబాబుకి తాత్కాలికంగా కాకినాడ ఎంపీ సీటు అని ఊరట కలిగించేందుకు చెబుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

అయితే గతంలో పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా తోట సుబ్బారావు నాయుడికి టికెట్‌ భరోసా ఇచ్చారు. రాజప్పకు ధీటైన పోటీ ఇవ్వలేడని భావించి నాయుడిని తొలగించి దవులూరి దొరబాబుకి టిక్కెట్‌ హామీ ఇచ్చి కోఆర్డినేటర్‌ పదవి కట్టబెట్టారు. దవులూరి దొరబాబు ఈ నాలుగైదు నెలలు పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన తర్వాత మరో కొత్త అభ్యర్థిని పెద్దాపురం అసెంబ్లీకి తెరపైకి తేవడంతో అక్కడ ఆ పార్టీ కేడర్‌లో కాస్త గందరగోళం నెలకొంది.

మరి చూడాలి తోట ఫ్యామిలీకి పెద్దాపురం వైసీపీ క్యాడర్ పూర్తిగా సహకరించి..ఆమె గెలుపు ఎంతవరకు సహకరిస్తారు అనేది. అయితే వాణి…చినరాజప్పకి పోటీ ఇవ్వడం ఖాయం. గత ఎన్నికల మాదిరిగా ఇక్కడ సైకిల్ సవారి అంత సులువు కాదనే చెప్పాలి.

మామాట: మరి పెద్దాపురంలో ఫ్యాన్ తిరుగుతుందో లేక సైకిల్ పరిగెడుతుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: