ఉత్తరాంధ్రలో హోరాహోరీ….జనసేన కూడా గట్టి పోటీ ఇస్తుందంటా…

Share Icons:

విశాఖపట్నం, 27 ఏప్రిల్:

ఎన్నికల ఫలితాలకి ఇంకా నెల రోజులు సమయం ఉండటంతో సోషల్ మీడియాలో రోజుకో రకం సర్వే హల్చల్ చేస్తోంది. ఇక వీటికి తోడు ప్రధాన పార్టీలు సొంత సర్వేలు చేయించుకొని ఫలితాలపై తమదైన లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించి ఓ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాని ప్రకారం ఉత్తరాంధ్రలో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు ఉందని, అలాగా వీరికి జనసేన కూడా గట్టి పోటీ ఇస్తుందని తేలింది. శ్రీకాకుళం జిల్లాను పరిశీలిస్తే… అక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా… వాటిలో టీడీపీ, వైసీపీలు ఖచ్చితంగా చెరో నాలుగు స్థానాలు గెలుస్తాయని, మిగిలిన రెండిటిలో జనసేన ఒక స్థానంలో గెలిచేలా ఉందని తెలిసింది. ఇక ఒక స్థానంలో టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తేలింది.

అటు విజయనగరం జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో వైసీపీ దాదాపు నాలుగు స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందనీ తెలిసింది. మరో రెండు స్థానాల్లో టీడీపీ, జనసేనతో పోటీ పడుతున్నట్లు ఉందని తేలింది. అయితే టీడీపీ ఖచ్చితంగా మూడు స్థానాల్లో విజయం సాధించి… మరో రెండు స్థానాల్లో జనసేన, వైసీపీతో పోటీ పడుతోందని తెలిసింది.

విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా… టీడీపీ కచ్చితంగా ఐదు స్థానాల్లో గెలుస్తూ… మరో స్థానంలో గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది. వైసీపీ కచ్చితంగా 4 స్థానాల్లో గెలుస్తుందనీ, జనసేన రెండు స్థానాల్ని కైవసం చేసుకుంటుందనీ సమాచారం. మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తెలుస్తోంది.

మామాట: మరి ఈ సర్వే ఏ మేర నిజమవుతుందో చూడాలి….

Leave a Reply