ఈ సారి అక్కడ ఫ్యాన్ తిరగడం ఖాయమేనా…?

Share Icons:

గుంటూరు, 14 మార్చి: 

గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం … ఇక్కడ టీడీపీ తరుపున కొమ్మాలపాటి శ్రీధర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.  అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఏం సాధించారనేది పక్కన పెడితే, గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ, సొంత కులానికి ప్రాధాన్యత ఇవ్వడంతో సొంత పార్టిలోనే ఆయనపై అసంతృప్తి తారా స్దాయికి చేరినట్లు కనిపిస్తోంది.

ఇలా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవటంతో, ఇప్పుడు అది ఆయన గెలుపు పై ప్రభావం చూపించే పరిస్థితి నెలకొంది. ఇక ఈ నియోజకవర్గంలో అభివృద్ది జరిగీ జరగనట్లు కనిపిస్తుండటం కూడా ఆయనపై ప్రభావం చూపనుంది. అటు పెద్దకూరపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కావేటి మనోహర్‌నాయుడును మొదట్లో నియమించారు, అయితే పీకే సర్వే ఫలితాలతో మనోహర్‌ను తప్పించి, నంబూరి శంకర్ రావును తెరమీదకు తెచ్చింది వైసీపీ. స్దానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శంకర్ రావు టీడీపీ ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన నాయకుడే. ఆయనకు ఎమ్మెల్యే సన్నిహితులతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే టీడీపీలోని అసంతృప్తులతో ఆయన ఇప్పటికే టచ్‌లో ఉన్నారు.

ఇక ప్రభుత్వం, ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకిత తనని గెలిపిస్తాయని శంకర్ భావిస్తున్నారు. ఆపైగా నియోజకవర్గం పరిస్థితిపై పక్కాగా లెక్కలు వేసుకొని ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన నేతను ప్రత్యర్దిగా నిలబెట్టింది వైసీపీ.. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది . మరి చూడాలి ఈసారి పెదకూరపాడులో ఫ్యాన్ తిరుగుతుందో లేదో.

మామాట: మొత్తానికి రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందిలే

Leave a Reply