జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ రచ్చ…

Share Icons:

విజయవాడ, 10 జనవరి:

కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో టీడీపీ. వైసీపీ పార్టీల కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే…జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతుండగా, వైపీపీ నేత రామచంద్రరావు అడ్డుపడ్డారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, పేదల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు.

ఇక ఇదే సమయంలో వైసీపీ నేత పార్థసారధి కూడా అక్కడకు వచ్చి టీడీపీపై విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నాయకులు కూడా రెచ్చిపోయారు. అలాగే ఇరు పార్టీ కార్యకర్తలు పరస్పరం అసభ్యకరంగా తిట్టుకున్నారు. ఆ తర్వాత కుర్చీలతో కొట్టుకున్నారు. జన్మభూమి కార్యక్రమం బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాలను అడ్డుకున్నారు. వైసీపీ నాయకులని అక్కడ నుండి పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

మామాట: మొత్తానికి పెద్ద రచ్చే చేశారు…

Leave a Reply