లోకల్ వార్: తెరపైకి టీడీపీ-జనసేన పొత్తు…

Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు టీడీపీ-సి‌పి‌ఐ పార్టీ కూడా పొత్తులో ముందుకెళుతున్నాయి. అయితే అధికార వైసీపీని అడ్డుకునేందుకు టీడీపీ-జనసేన పొత్తు కూడా తెరపైకి వచ్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితులని బట్టి అధినేతలతో సంబంధం లేకుండా లోకల్ నాయకులు పొత్తుతో ముందుకెళుతున్నారు.

టీడీపీ, జనసేన ఒక కూటమిగా కొన్ని చోట్ల పోటీ చేస్తుంటే… మరికొన్ని చోట్ల టీడీపీ, వామపక్షాలు, జనసేన సర్దుబాట్లు చేసుకొంటున్నాయి. ముమ్మిడివరంలో సోమవారం టీడీపీ నాయకుడు తాడి నరసింహారావు ఇంట్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ పితాని బాలకృష్ణ తదితరులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 76 ఎంపీటీసీ స్థానాల్లో 13, నాలుగు జడ్పీటీసీల్లో ఒకటి, ముమ్మిడివరం నగర పంచాయతీ 20 వార్డుల్లో 2 స్థానాలు జనసేనకు కేటాయించేలా నిర్ణయించుకున్నారు. పి గన్నవరం మండల స్థాయిలోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఖరారైనట్లు సమాచారం.

ఇప్పుడు. ఈ మొత్తం వ్యవహారం జనసేన అధినేత పవన్ అనుమతితో జరిగిందా..లేక స్థానిక నేతలే అత్యుత్సాహం ప్రదర్శించి..ఈ ఒప్పందం చేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ఇదే తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ గెలిచారు. తొలుత జనసేన అధినేత నిర్ణయాలకు అనుగుణంగా పని చేసినా..ఇప్పుడు పూర్తిగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయినా..పవన్ కళ్యాణ్ ఆయన మీద ఎటువంటి చర్యలకు దిగలేదు.

అయితే, టీడీపీతో స్థానికంగా పొత్తుల విషయంలో పవన్ అనుమతి ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు జనసేనతో పొత్తు అని చెబుతూనే..ఢిల్లీ స్థాయిలో మాత్రం సీఎం జగన్ తో మైత్రి కోరుకుంటన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు స్థానికంగా టీడీపీ నేతల ట్రాప్ లో జనసేన నేతలు పడ్డారా..లేక ఇదంతా ప్రణాళిక మేరకే జరిగిందా అనేది జనసేన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

 

Leave a Reply