TRENDING NOW

హరీష్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీ మైండ్‌గేమ్..

హరీష్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీ మైండ్‌గేమ్..
Views:
33

హైదరాబాద్, 8 నవంబర్:

మరో కొన్నిరోజుల్లో తెలంగాణ శాసనసభకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్-టీడీపీ నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ తరుణంలోనే టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న టీఆర్ఎస్ కీలక నేత హరీష్‌‌రావు‌పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహత్మకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. హరీష్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ రెండు పార్టీల నేతలు ఎదురుదాడికి దిగారు. మైండ్‌గేమ్‌తో టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే 2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేసీఆర్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన హరీష్.. ఈ దఫా కూడ కేసీఆర్ గెలుపును తన భుజాలపై వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడం   ప్రతాప్ రెడ్డికి కలిసొచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్, వంటేరుల మధ్య పోటీ రసవత్తరంగా జరగనుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే గజ్వేల్ నియోజకవర్గంలో హరీష్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హరీష్‌రావు రాహుల్‌తో టచ్‌లో ఉన్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను హరీష్ రావు ఖండించారు.

ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబుపై హరీష్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చంద్రబాబు .. నీ రికార్డులు బయటపెడతాం అంటూ హెచ్చరించారు. ప్రతాప్ రెడ్డి చంద్రబాబు  స్క్రిఫ్ట్‌ను చదివి విన్పిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఇక వంటేరుకి తోడుగా హరీష్‌రావు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌లో హరీష్ అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉంటున్నాడని రేవూరి ఆరోపించారు.  సమయం కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారని, ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు సరైన సీట్లు రాకపోతే ప్రజా కూటమితో కలిసి సీఎం పీఠాన్ని అధిష్టిస్తారని సంచలన ఆరోపణలు చేశారు.

మళ్ళీ ఈ ఆరోపణలకు హరీష్ రావు కౌంటరిచ్చారు. రేవూరి నాలుక కోస్తానని హెచ్చరించారు. అలాగే హరీష్‌పై  తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రేవూరి ప్రకాష్ రెడ్డి  ప్రకటించారు. కేసీఆర్  తన రాజకీయ వారసుడిగా హరీష్‌రావును ప్రకటిస్తే  తాను హరీష్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటానని రేవూరి ప్రకటించారు. 

ఇదిలా ఉంటే రేవూరికి తోడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా గళం విప్పారు.

హరీష్‌రావు టీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో హరీష్ రావు చర్చించిన తర్వాత ఆయన టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారని రేవంత్ గుర్తుచేశారు. అలాగే హరీశ్ జాతకం అంతా కేసీఆర్ చేతుల్లో ఉంది అన్నారు.

ఇలా వారం రోజులుగా హరీష్‌ను లక్ష్యంగా చేసుకొని ఒకరి తర్వాత ఒకరు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు  విమర్శలు చేస్తున్నారు. మైండ్‌గేమ్‌తో హరీష్‌తో పాటు టీఆర్ఎస్‌ను  దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. హరీష్‌ను దెబ్బతీస్తే దాని ప్రభావం గజ్వేల్‌తో పాటు టీఆర్ఎస్ క్యాడర్‌పై ఉంటుందని మైండ్‌గేమ్‌కు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరి చూడాలి విపక్షాల మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టి హరీశ్ బయటకు వస్తారా… ఇక ఈ మైండ్ గేమ్ ఏ మేరకు విపక్షాలు కలిసి వస్తోందనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

మామాట: ఎన్నికల సమయంలో ఈ మైండ్‌గేములు మామూలే….

(Visited 37 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: