టీటీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలి…..

Share Icons:

హైదరాబాద్, 1 మార్చి:

తెలంగాణ టీడీపీ పగ్గాలు హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని కోరారు.

బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టీటీడీపీ అధ్యక్షుడు రమణ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు చంద్రబాబు ముందే టీటీడీపీ బాధ్యతలు హీరో ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ నినాదాలు చేశారు.

అలాగే పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని, తెలంగాణలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు పెట్టుకోవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేయగా వారిని చంద్రబాబు సముదాయించారు.

అనంతరం అందరితో మాట్లాడి తగిన సమయంలో పొత్తుపై తగిన నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు సర్వ శక్తులు వడ్డాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. ఇక ఈరోజు చంద్రబాబు పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీ నాయకులతో సమావేశం అవుతారు.

మామాట: ఇవన్నీ అంత తేలికగా జరిగే పనులు కావు అనుకుంటా…

English summary:

The party activists asked the TDP national president Chandrababu to give Telangana TDP party leadership to the junior NTR.

Leave a Reply