ఆండ్రాయిడ్‌ సెట్‌ టాప్‌ బాక్స్‌…ఉపయోగాలు ఇవే…

tata sky binge plus android set top box
Share Icons:

ముంబై: ప్రముఖ డీటీహెచ్‌ ఆపరేటర్‌ టాటా స్కై.. బింగ్‌ ప్లస్‌ పేరిట నూతన ఆండ్రాయిడ్‌ ఆధారిత సెట్‌ టాప్‌ బాక్స్‌ను లాంచ్‌ చేసింది. రూ.5,999 ధరకు ఈ బాక్స్‌ వినియోగదారులకు లభిస్తున్నది. . ఈ డివైస్‌లో 2జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే హాట్‌స్టార్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ, ఈరోస్‌ నౌ, జీ5, హంగామా ప్లే తదితర యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.

అయితే ఆండ్రాయిడ్‌ టీవీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఈ బాక్స్‌ పనిచేస్తుంది. ఇక గూగుల్‌ ప్లే స్టోర్‌కు ఇందులో యాక్సెస్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌ను బాక్స్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇందులో గూగుల్‌ అసిస్టెంట్‌ బేస్డ్‌ వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ బాక్స్‌ను కొనుగోలు చేసిన వారికి 30 రోజుల పాటు టాటా స్కై బింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. ఈ బాక్స్‌లో 5వేలకు పైగా యాప్స్‌, గేమ్స్‌ను అందిస్తున్నారు.

సోనీ వాక్‌మన్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సోనీ నూతన వాక్‌మన్‌ మీడియా ప్లేయర్‌ను లాంచ్‌ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి ఈ వాక్‌మన్‌ను రూ.23,990 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.  వాక్‌మన్‌ ఎన్‌డబ్ల్యూ-ఎ 105 పేరిట ఈ వాక్‌మన్‌ భారత్‌లో విడుదలైంది. ఈ వాక్‌మన్‌ ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. 128 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. 3.6 ఇంచ్‌ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేను ఈ వాక్‌మన్‌ కలిగి ఉంది. ఈ వాక్‌మన్‌ 26 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

ఎక్స్‌10 పేరిట మీ (MEE) ఆడియో కంపెనీ భారత్‌లో నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. రూ.4,999 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు లభిస్తున్నాయి. ఐపీఎక్స్‌5 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను వీటికి అందిస్తున్నారు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ ఇయర్‌బడ్స్‌ ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. ఇవి చార్జింగ్‌ కేస్‌తో 23 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. డీప్‌ బేస్‌, క్రిస్టల్‌ క్లియర్‌ సౌండ్‌ ఫీచర్లను వీటికి అందిస్తున్నారు. దీంతో సౌండ్‌ క్వాలిటీ బాగుంటుంది.

 

Leave a Reply