తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు: బలిసినోళ్ళకి ఆ పథకం ఎందుకు?

Share Icons:

హైదరాబాద్, 17 జూన్:

ఏపీ సీఎం జగన్…తమ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా…. బడికి పంపే ప్రతి పిల్లల తల్లికి 15 వేలు ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే.  అమ్మఒడి పాతకమ ద్వారా అర్హులైన వారికి ఈ పథకం అందనుంది.

అయితే ఈ పథకం అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు మాత్రమే 15 వేలు ఇస్తే బాగుంటుందని, అలా కాకుండా ప్రవేట్ పాఠశాలలకు పంపే తల్లులకు కూడా ఇస్తే అది మొదటికే మోసం వస్తుందని,దాని వలన ప్రభుత్వ పాఠశాలలు మరింత హీనస్థితికి చేరుతాయనే వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ కూడా దీనిపై మాట్లాడుతూ, బాగా ఒళ్ళు బలిసిన వాళ్లే తమ పిల్లలను ప్రవైట్ పాఠశాలకు పంపిస్తారని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లే ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని, కాబట్టి ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థి తల్లులకు ఇస్తే బాగుంటుందని అన్నారు.

అవసరం అయితే 15 వేలుని పెంచి 20 వేలు ఇచ్చిన ఇంకా బాగుంటుందని, అదే విధంగా గతంలో ప్రవేశపెట్టిన స్కాలర్ షిప్ లోని కొన్ని లొసుగుల వలన అది అక్రమాల బాట పట్టిందని, దానిని గమనించి జగన్ ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయబడ్డారు

Leave a Reply