తిరువారూర్ ఉప ఎన్నిక రద్దు చేసిన ఈసీ…

Share Icons:

చెన్నై, 7 జనవరి:

తమిళనాడు తిరువారూర్ నియోజకవర్గం నుంచి ఐదు దశాబ్ధాలుగా ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గతేడాది ఆగస్టు 7న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తిరువారూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ అసెంబ్లీ స్థానానికి జనవరి 28న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

అయితే ఇటీవల తమిళనాడులో సంభవించిందని గజ తుఫాను కారణంగా భారీ ఆస్తి, ప్రాణనష్టం చోటు చేసుకుంది. తుఫాను బాధితులకు అందాల్సిన నష్టపరిహారం ఇంకా పూర్తిగా అందలేదని, అందువల్ల ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉప ఎన్నిక వాయిదా వేయ్యాలని పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

దీనిని పరిగణలోనికి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తిరువారూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది.

మామాట: మళ్ళీ ఉపఎన్నిక పెడతారో…

Leave a Reply