పప్పుగా అంటూ….రవిని టార్గెట్ చేసి హౌస్ లో రచ్చ చేసిన తమన్నా

tamanna personally attacked ravi krishna in big boss house
Share Icons:

హైదరాబాద్:

 

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తమన్నా…..రోజురోజుకి హౌస్ లో రచ్చ రేపుతోంది. తనని ఎలిమినేషన్ లో నామినేట్ చేశాడని రవిని టార్గెట్ చేసుకుని హింసించే ప్రయత్నం చేస్తుంది. ఇక రవితో పాటు రాహుల్ సిప్లిగంజ్‌, శివ జ్యోతిల‌ని టార్గెట్ చేసి నీచంగా మాట్లాడుతుంది. రోజు రోజుకి వారి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తూ నెటిజ‌న్స్ దృష్టిలోను బ్యాడ్ అవుతుంది.

 

నేనింతే .. టార్గెట్ చేస్తే ఇలానే ఉంటుంది. నువ్వు మ‌గాడివా కాదా అంటూ అస‌భ్య‌ప‌ద‌జాలంతో త‌మ‌న్నా హౌస్ లో దారుణంగా ప్రవర్తిస్తుంది. అలాగే నిన్న కూడా ర‌వికృష్ణ‌ని ప‌ప్పుగాడు అంటూ ప‌ర్స‌న‌ల్ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. ఆయ‌న ఎక్క‌డికి వెళితే అక్క‌డికి వెళ్లి ఏవోవో మాట‌లు మాట్లాడుతూ ర‌వికృష్ణ సహ‌నాన్ని ప‌రీక్షించింది. ఈ మ‌ధ్య‌లో శివ‌జ్యోతిపై కూడా నోరు పారేసుకుంది. శివ జ్యోతి జర్న‌లిజంకి స‌రిపోద‌ని, ఆమె డ‌బ్బు కోసం చేసే న‌ట‌న ఇది అని అన‌డంతో శివజ్యోతి ధీటుగా స్పందించింది. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

 

ఇక ఈ వివాదం ముగిసిన త‌ర్వాత మ‌ళ్ళీ ర‌వికృష్ణ‌ని టార్గెట్ చేస్తూ ఆయ‌న నవ్వులో కూడా దమ్ములేదు .. నువ్ మగాడికి కాదు.. రేయ్ పప్పూ అంటూ రెచ్చగొట్టింది. త‌న‌కి ఒక వ్యక్తితో ప్రాబ్ల‌మ్ అని ముందు చెప్పిన త‌మ‌న్నా.. రోహిణి, అలీ రాజా, రాహుల్ సిప్లిగంజ్‌తో కూడా గొడ‌వ‌ప‌డుతూనే ఉంది. క‌న్ఫెష‌న్ రూంలో త‌మ‌న్నా ప్ర‌వ‌ర్త‌న గురించి శ్రీముఖి, ర‌వికృష్ణ బిగ్ బాస్ తెలియ‌జేశారు. ఆమె చాలా హ‌ద్దుమీరుతుంద‌ని , ఆమె ప్ర‌వ‌ర్తించే తీరు ఎవ‌రికి నచ్చ‌డం లేద‌ని వారు వాపోయారు.

 

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. దొంగలున్నారు జాగ్రత్త అనే కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా తికమకపురంలో ఊరి పెద్దగా వరుణ్‌ సందేశ్‌,తమన్నాలు ఉంటార‌ని .. ఊరిలో ఓ జంట అలీ , పున‌ర్న‌వి.. అన్న‌ద‌మ్ములు రాహుల్ ,మ‌హేష్‌.. అక్క చెల్లెళ్లు రోహిణి, వితిక‌ పని కోసం ఎదురు చూసే లాయర్‌గా హిమజగా ఉంటారు. బద్దకస్తుడైన పోలీస్‌ ఆఫీసర్‌ బాబా భాస్కర్‌.. స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌గా శివజ్యోతి . ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని జైల్లో వేయాలని తెలిపాడు. అయితే టాస్క్ మ‌ధ్య‌లోనే ఈ ఎపిసోడ్‌కి బ్రేక్ ప‌డింది.

Leave a Reply