అనుకున్నట్లే అయింది…బిగ్ బాస్ నుంచి తమన్నా ఔట్…

tamanna personally attacked ravi krishna in big boss house
Share Icons:

 

హైదరాబాద్:

 

బిగ్ బాస్ షో లో అనుకున్నదే అయింది. వారం రోజుల నుంచి హౌస్ లో రచ్చ చేస్తున్న తమన్నా ఆదివారం ఎపిసోడ్ లో ఇంటి నుంచి బయటకొచ్చేసింది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఐదుగురు సభ్యులు వితిక, రాహుల్, పునర్నవి, బాబా భాస్కర్, తమన్నాలు ఉన్నారు. అయితే ఎలిమినేషన్ కంటే నాగ్ హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు.

 

ఓ బాక్సులో చిట్టీలు వేసి.. వారికి తీసిన చిట్టీలో ఉండే పాటను ఇంట్లోని సెలబ్రిటీలకు అంకితం చేయాలి. అలా ఒకోరు ఒక చీటి తీసుకుని వచ్చిన పాటని మరొకరికి అంకితం చేశారు .  గేమ్ సాగుతుండగానే ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మొదటి విడుతగా సేఫ్‌ అయ్యారు. అనంతరం కూడా అంకింత పాటల కార్యక్రమం సాగుతున్న సమయంలో వెన్నెల కిషోర్ ఇంట్లోని వేదికపైకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బాబా భాస్కర్‌ను ఎలిమినేషన్‌లో నుంచి సేఫ్ చేశారు. దాంతో ఎలిమినేషన్‌లో తమన్నా, వితిక మిగిలారు

 

ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మొదటి విడుతగా సేఫ్‌ అయ్యారు. అనంతరం కూడా అంకింత పాటల కార్యక్రమం సాగుతున్న సమయంలో వెన్నెల కిషోర్ ఇంట్లోని వేదికపైకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బాబా భాస్కర్‌ను ఎలిమినేషన్‌లో నుంచి సేఫ్ చేశారు. దాంతో ఎలిమినేషన్‌లో తమన్నా, వితిక మిగిలారు

 

ఇక నాగ్‌తో కలిసి వెన్నెల కిషోర్ తనదైన శైలిలో వినోదాన్ని పంచారు. గేమ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరి గురించి, వారి ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పి వారిలో సంతోషాన్ని పంచారు. మహేష్ విట్టను ఆప్యాయంగా పలుకరించారు. శ్రీముఖిని డార్లింగ్ అంటూ పలకరించి మా ఇంట్లో అందరూ మీకు ఫ్యాన్స్ అంటూ చెప్పారు. ఇలా ప్రతీ ఒక్కరి గురించి వారి పాజిటివ్ పాయింట్స్‌ను వెన్నెల కిషోర్ వెల్లడించారు.

 

వెన్నెల కిషోర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ నామినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టారు. మిగిలిన ఇద్దరు తమన్నా, వితికలో ఎవరు సేఫ్ అవుతారని అడిగిన తర్వాత మెజారిటీ సభ్యులు సూచించిన ప్రకారం తమన్నా ఎలిమినేట్ అయ్యారనే హోస్ట్ నాగ్ ప్రకటించారు.

Leave a Reply