అంతర్జాతీయ ఉగ్రవాది  ఫజ్లుల్లా హతం…

Taliban Chief Who Ordered Hit On Malala Yousafzai Killed In US Strike
Share Icons:

ఇస్లామాబాద్, 16 జూన్:

2014 పెషావర్‌ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది, పాకిస్థాన్ తాలిబాన్ అధిపతి మౌలానా ఫజ్లుల్లా హతమయ్యాడు.

ఆఫ్ఘనిస్థాన్‌ లోని తూర్పు కునార్ ప్రావిన్స్‌లో బుధవారం అమెరికా భద్రతాదళాలు చేపట్టిన డ్రోన్ దాడుల్లో ఫజ్లుల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌ రక్షణమంత్రిత్వశాఖ ప్రతినిధి శుక్రవారం ధ్రువీకరించారు.

బాలికల విద్య కోసం కృషిచేస్తున్న కారణంగా మలాలా యూసఫ్‌జాయ్‌ని హతమార్చమని ఫజ్లుల్లా 2012లో ఆదేశించాడు.

ఇక 2013 నుంచి పాకిస్థానీ తాలిబాన్ సంస్థకు అధిపతిగా చలామణి అవుతూ ఫజ్లుల్లా అమెరికా, పాకిస్థాన్ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు.

అలాగే 2014లో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడికి ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో 130 మంది పిల్లలు సహా 151 మంది మరణించారు.

దీంతో అమెరికా ఫజ్లుల్లాను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసి.. ఆయన తలపై 50 లక్షల డాలర్ల (రూ.34 కోట్లు) రివార్డును ప్రకటించింది.

కాగా, కునార్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ నెల 13న జరిపిన డ్రోన్ దాడుల్లో ఉగ్రవాద నాయకుడు హతమైనట్టు అమెరికా లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోన్నెల్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ నాయకుడు ఎవరనేది లెఫ్టినెంట్ చెప్పలేదు కానీ ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ ప్రతినిధి మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మామాట: ఇలా ఇంకెంతమంది ఉగ్రవాదులు ఉన్నారో?

Leave a Reply