చంద్రబాబుపై సెటైర్లు వేసిన తలసాని…

Share Icons:

తిరుపతి, 7 జనవరి:

ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన తీరు సరిగ్గా లేదని, ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ తరహాలో దీక్షలకు కూర్చుంటోందని తలసాని ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ వెంట పడుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం చంద్రబాబు పనిచేయకుండా పబ్లిసిటీతో గడిపేస్తున్నారని విమర్శించారు. ఇక రాబోయే నాలుగు నెలల్లో దేశ రాజకీయాల ముఖచిత్రం మారబోతోందని తలసాని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు. అలాగే ఏపీ రాజకీయాల్లోనూ కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.

మామాట: ఈ మధ్య శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడటమే సరిపోతుంది….

Leave a Reply