బాబు… పొత్తు పర్యవసానాలు రాబోయే రోజుల్లో అనుభవిస్తావు….

Share Icons:

హైదరాబాద్, 15 సెప్టెంబర్:

ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటికీ క్షమించరని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ పొత్తు పర్యవసానాలు రాబోయే రోజుల్లో చంద్రబాబు అనుభవిస్తారని తెలిపారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…. గత నాలుగు రోజులగా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని, బాబ్లీ విషయంలో చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుట్రపన్నితే తమ పార్టీలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎందుకు నోటీసులు వస్తాయంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం, బుద్ది ఉందా అంటూ మండిపడ్డారు. బాబ్లీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కాంగ్రెస్ హయాంలో బాబ్లీ ఘటన జరిగిందని… ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే దానికి టీఆర్ఎస్ బాధ్యులను చేస్తారా అంటూ మండిపడ్డారు.

మామాట: అంటే ఈ పొత్తు ప్రభావం ఆంధ్రా ఎన్నికల్లో ఉంటుంది అంటారా….

Leave a Reply