తలసాని మళ్ళీ వచ్చారు…సెటైర్ వేశారు…

Share Icons:

విజయవాడ, 14 ఫిబ్రవరి:

ఇటీవల ఏపీకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్…మరోసారి ఏపీ పర్యటనకి వచ్చారు. ఈరోజు విజయవాడకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏపీలో పర్యటించి వెళితే, యాదవ సంఘాల నాయకులను, తన వారిని వేధించడం ఏంటని నిప్పులు చెరిగారు.

ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.  మాట్లాడితే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని, ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తలసాని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో తాము 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామని, ఏపీలో మాటలు చెబుతున్నారే తప్ప అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న డబ్బులన్నీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకేనని, ఎన్నికల తరువాత చేతులెత్తేస్తారని విమర్శించారు.

మామాట: మరి దీనికి టీడీపీ నేతలు కౌంటర్ ఏం ఇస్తారో

Leave a Reply