బీజేపీలో ఔట్ డేటెడ్ క్యాండిడేట్స్ చేరుతున్నారు: తలసాని

Share Icons:

హైదరాబాద్:

 

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ కమలం పేరిట ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. క్యాడర్ లేకుండా నేతలను చేర్చుకున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా బలపడదని స్పష్టం చేశారు. ప్రస్తుం బీజేపీలో కాలంతీరిన నేతలు(ఔట్ డేటెడ్ క్యాండిడేట్స్) చేరుతున్నారనీ, దీనివల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని తేల్చిచెప్పారు.

 

ఇక టీడీపీ నేతలను చంద్రబాబు స్వయంగా బీజేపీలోకి పంపారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదని తలసాని తెలిపారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గాలి పనిచేసిందని తలసాని అంగీకరించారు. రాజకీయాలకు పనికిరాని కొందరు వ్యక్తులు  ఆ గాలిలోనే తెలంగాణలో గెలుపొందారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం పలుకుడి మున్సిపాలిటీల్లో ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్  ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్నది ఊహాగానాలేనని స్పష్టం చేశారు.

 

Leave a Reply