TRENDING NOW

తాజ్‌మహల్ శివాలయం కాదు…!

తాజ్‌మహల్ శివాలయం కాదు…!
views:
39

ఆగ్రా, 22 ఫిబ్రవరి:

ప్రపంచ ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్‌ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృతి చిహ్నంగా నిర్మించారనేది అందరికీ తెలిసిన విషయమే.

కాకపోతే, కొందరు తాజ్ మహల్ ఒక శివాలయమని, ఆ ఆలయంపైన దీన్ని నిర్మించారంటూ వాదిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని, శివాలయం కాదని భారత్ పురావస్తు శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగ్రా కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

షాజహాన్ తన భార్య స్మృతి చిహ్నంగానే ఈ ప్రేమమందిరం నిర్మించారంటూ పురావస్తు శాఖ తరపు న్యాయవాది అంజనీ శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

తాజ్ అనేది సమాధి కాదని, తేజోమహాలయ్ పేరుతో ఉన్న శివాలయమని కొందరు చేస్తున్న వాదనలు సరైనవి కాదని చెప్పారు.

ఒక గొప్ప చరిత్రకు తాజ్ మహల్ సాక్ష్యమని, దాని పేరును మార్చడమనేది చరిత్రను తప్పుపట్టినట్లే అని ఆయన మండిపడ్డారు.

మామాట: మొత్తానికి నిజనిజాలు బయటపడినట్లున్నాయి..

English summary:

With the Archaeological Survey of India (ASI) finally filing an affidavit in an Agra court declaring the Taj Mahal as the tomb of Emperor Shah Jahan and his wife Mumtaz Mahal, the controversy over the Taj Mahal’s alleged past as a Shiva temple is expected to finally come to an end.

(Visited 34 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: